మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం,


మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం,

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
  ఏలూరు జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్  యొక్క ఆదేశాలపై   05.12.2025 వ తేది నాడు ఏలూరు అమీనా పేటలో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం, క్రీడా విజేతలకు బహుమతులు కార్యక్రమము ను నిర్వహించినారు.

  శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, అమీనపేట, ఏలూరు లో ఉన్న శ్రీ సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఈరోజు తల్లి దండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం, స్పోర్ట్స్ మీట్‌లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది.

    ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)  ఎన్. సూర్య చంద్రరావు  ముఖ్య అతిథిగా హాజరై, 2025-2026 విద్యా సంవత్సరం బాలుర స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం ప్రాముఖ్యత* గురించి అదనపు ఎస్పీ అడ్మిన్  ఎన్. సూర్య చంద్రరావు  మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు మధ్య సఖ్యత, సమన్వయం ఎంతైనా అవసరమని నొక్కి చెప్పారు. విద్యార్థుల చదువులు, సమస్యలపై చర్చించడానికి ఇటువంటి ఆత్మీయ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు.

 క్రీడల వలన కలిగే ఉపయోగాలు గురించి 

విద్యార్థులకు అదనపు ఎస్పీ అడ్మిన్  మాట్లాడుతూ విద్యార్దులు క్రీడలలో పాల్గొనడం వలన విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు.

  క్రీడలు కేవలం వినోదం కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ (Team Work) వంటి ముఖ్యమైన లక్షణాలను పెంపొందిస్తాయని వివరించారు. ఈ లక్షణాలు విద్యార్థులు తమ చదువులలో ముందడుగు వేయడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.

    ఆటల్లో గెలవడానికి ఎంత నిబద్ధత అవసరమో, చదువులో రాణించడానికి కూడా అంతే నిబద్ధత అవసరమని విద్యార్థులకు సూచించారు.ఆటల పోటీలలో విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

      ఈ కార్యక్రమంలో సి ఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు  సాయి కుమారి శంకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు  స్రవంతి , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post