మిస్టరీ ని చేధించిన అనకాపల్లి జిల్లా...కశింకోట పోలీసులు.


 మిస్టరీ ని చేధించిన అనకాపల్లి జిల్లా...కశింకోట పోలీసులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి డిసెంబర్ 13

            కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన అనుమానాస్పద మరణ ఘటనపై దర్యాప్తు కొనసాగించగా, ఈ ఘటన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతుడి కుటుంబ సభ్యులే చేసిన హత్యగా పోలీసులు గుర్తించారు. నేరానికి ప్రేరణ (Motive):ప్రధాన నిందితుడు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉండటంతో, ఆ అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో మృతుడి పేరుమీద అనేక ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి, మృతుడిని హత్య చేసి, ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలని పథకం వేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది.మృతుడి : కుర్రు నారాయణమూర్తి , s/o మాలి బాబు, 54 yrs, కొత్తపల్లి గ్రామం, కశింకోట మండలం, అనకాపల్లి జిల్లా.పేరుమీద తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలు: 

పథకం ప్రకారం నిందితులు మృతుడి పేరుమీద క్రింది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు:

1. LIC ఇన్సూరెన్స్ పాలసీలు – ₹5,00,000

2. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పాలసీ – ₹8,00,000

3. SBI జనరల్ ఇన్సూరెన్స్ (ఆక్సిడెంట్ పాలసీ) – ₹40,00,000

4. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ – ₹20,00,000

5. శ్రీరామ్ లైఫ్ / జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ – ₹10,00,000

6. బజాజ్ అలయాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ – ₹5,00,000

7. సాగర్ సిమెంట్ కంపెనీ ద్వారా కల్పించబడిన GPA పాలసీ – ₹20,00,000

మొత్తం పొందాలని పథకం వేసుకున్న ఇన్సూరెన్స్ మొత్తం: సుమారు ₹1.08 కోట్లు.

నేర విధానం (Modus Operandi): నిందితులు మృతుడిని హత్య చేసి, ఆ ఘటనను తెలియని వాహనం ఢీకొన్న రోడ్డు ప్రమాదంగా చూపించి, ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి క్లెయిమ్ పొందాలని పథకం వేశారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులను మరియు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు.

కేసు గుర్తింపు (Detection): ఇన్‌క్వెస్ట్ మరియు పోస్ట్‌మార్టం అనంతరం గాయాల స్వభావంపై కశింకోట పోలీసులకు అనుమానం ఏర్పడింది. తదనంతరం టవర్ డంప్, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ వంటి సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేయగా కశింకోట సీఐ మరియు ఎస్సై, నిందితుల పాత్ర వెలుగులోకి వచ్చింది. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. 

ప్రస్తుతం కేసులో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తులో నిందితులు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతుడిని హత్య చేయాలనే ఉద్దేశంతో ముందుగానే పథకం వేసుకున్నట్టు తేలింది. పథకం ప్రకారం మృతుడి పేరుమీద అనేక ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని, మృతుడి మరణాన్ని ప్రమాదంగా చూపించి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయాలని నిర్ణయించారు. ఘటన రోజు నిందితులు మృతుడిని పథకం ప్రకారం ఒంటరిగా తీసుకెళ్లి దాడి చేసి తీవ్ర గాయాలు కలిగించారు. అనంతరం మృతుడి మోటార్ సైకిల్‌ను రోడ్డుపై ఉంచి, తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంగా చూపిస్తూ కుటుంబ సభ్యులు మరియు ఇతరులను తప్పుదారి పట్టించారు. ఈ విధంగా హత్యను ప్రమాదంగా మలచి ఇన్సూరెన్స్ డబ్బులు పొందాలనే ప్రయత్నం చేశారు.

        శవ పంచనామా మరియు పోస్ట్‌మార్టం అనంతరం చనిపోయిన వ్యక్తి యొక్క గాయాల స్వభావంపై మరియు కుటుంబ సభ్యులు కదలికపై అనుమానం ఏర్పడింది. తదుపరి సాంకేతిక ఆధారాలు మరియు విచారణలో నిందితుల కుట్ర వెలుగులోకి వచ్చి కేసు గుర్తించబడింది. ఇంత తొందరగా కేసు చేదించిన కసింకోట పోలీసు వారిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ మరియు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి అభినందించారు.

Post a Comment

Previous Post Next Post