వ్యాక్సిన్ లేని వ్యాధి నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి నివారణకు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు కురెళ్ళ వర ప్రసాద్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. స్క్రబ్ టైపస్ వ్యాధి నిశ్శబ్దంగా ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారని,విజయనగరం,పల్నాడు, బాపట్ల, పొట్టి శ్రీరాములు జిల్లాలకు చెందిన ఐదుగురు ఈ వ్యాధితో మృతి చెందడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తుందని విచారం వ్యక్తం చేశారు.ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి ప్రబలకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం తక్షణమే ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి మన జిల్లాలో ఈ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
