అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు,అమరజీవిశ్రీపొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు రాష్ట్రంఅవత రించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సీ.వి.ఎన్ రీడింగ్ రూమ్ ఎదురుగా ఉన్న శ్రీ అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి మరియు జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు,సంతనూ తలపాడు శాసనస భ్యులు బి.ఎన్ విజయ్ కుమార్, గిద్దలూరుశాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పూల మాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోల బాల వీరాంజ నేయ స్వామి మాట్లా డుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశార న్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి 15 కేజీల కిలోల బరువు తగ్గిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలిపి మహా ఉద్యమంలో పాల్గొ న్నారన్నారు. అమరజీవిపొట్టిశ్రీరాములుఆమరణ దీక్ష చేసి మరణించిన 10నెలల తర్వాత ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ప్రభు త్వం ప్రకటించిందని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మ అర్పణ దినోత్సవoగా గత సంవత్సరం అధికారికంగా ప్రభుత్వం ప్రక టించడంజరిగిందని ఆయన చెప్పారు.
శ్రీపొట్టిశ్రీరాములు త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధాని లో 55 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలోపాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.రాజా బాబుమాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పట్టుదల దేశవ్యాప్తంగా వ్యాపించే విధంగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రాన్నిసాధించారని ఆయన చెప్పారు.
ఆంధ్రులపౌరుషానికి ప్రతీకగా భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయ ని ఆయన చెప్పారు.మహాత్మాగాంధీ చేపట్టిన స్వాతంత్ర్య ఉద్యమంలో శ్రీ పొట్టి శ్రీరాములు చురుకుగా పాల్గొన్నారన్నారు.శ్రీపొట్టి శ్రీరాములు ఆశయాలనుప్రతి ఒక్కరూపాటించాలని ఈ సందర్భంగా చెప్పారు.
ఈకార్యక్ర మంలో బి.ఎన్. విజయ్ కుమార్ గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్. రియాజ్, జాయింట్ కలెక్టర్ ఆర్ .గోపాల కృష్ణ, జిల్లాసాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మణనాయక్, స్టెప్ సీఈఓ శ్రీమన్నా రాయణ, ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్ తహసిల్దార్ మధు సూదన్ రావు, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


