ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ను కార్పోరేట్ వైద్య శాలకు ధీటుగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి తీసుకో వలసినచర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారు లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 85 శాతం మంది పేద ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారన్నారు.
ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే రిమ్స్ హాస్పటల్ కు వస్తారని ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆయన అధికారులకు చెప్పారు.
రిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని ఆయన అధికారులకు చెప్పారు.
హాస్పిటల్ ప్రాంగణం మొత్తం శుభ్రంగా ఉండే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకో వాలన్నారు.
రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధికి ఆర్కిటెక్ ల సహాయం తో అవసరం మేర నిర్మాణాలు చేపట్టడాని కి చర్యలు తీసుకోవాల ని ఆయన చెప్పారు.
రిమ్స్ హాస్పిటల్ కి వచ్చి రోగుల నుండి వస్తువులు సౌకర్యాల పై ఫీడ్ బ్యాక్ తీసుకో వాలని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి. చిన్న ఓబులేసు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖఅధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు రిమ్స్ హాస్పిటల్ ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
