ఒంగోల్ లో.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ.




 ఒంగోల్ లో.ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

ఒంగోలు ఎయిడ్స్ పట్ల అవగాహనతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రితో పాటు ఎంపీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్.నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 700 మంది విద్యార్థిని విద్యార్థులతో. ప్రకాశం భవనం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని అతిథులు జెండా ఊపి, గాలిలోకి బెలూన్లు వదిలి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గణనీయంగా కేసులు తగ్గాయి అన్నారు. 

సమాజం నుంచి ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

ఈ వ్యాధి సంక్రమణ, వ్యాప్తిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎన్జీవో కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. 

ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి.షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post