బొబ్బిలిమున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా చైర్మన్ శరత్ బాబు జన్మదిన వేడుకలు.
చైర్మన్ శరత్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ సిబ్బంది మరియు నాయకులు.
బొబ్బిలి.క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీను.
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు జన్మదిన సందర్భంగా,మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి ఆధ్వర్యంలో, జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.మున్సిపల్ సిబ్బంది అందరూ చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..అదేవిధంగా పేదలకు వస్త్రదాన కార్యక్రమం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది.తర్వాత, బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి శశిభూషణరావు పాల్గొన్నారు.పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు,ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉద్యోగులు,కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శరత్ బాబు అభిమానులు,పెద్ద సంఖ్యలో పాల్గొని,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సాయంత్రం మరన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.



