మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ప్రకాశం కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం భోజనం పధకం మెనూ ను కచితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, శాసన సభ్యులు బిఎన్ విజయకుమార్ తో కలసి ఆకస్మికంగా సందర్శించి, మధ్యాహ్నం భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం భోజనం అమలు పై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రతిరోజు ఇలాగే ఉంటుందా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, భోజనం ఎలా వుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగా వుందని విద్యార్ధులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం భోజనం పధకం మెనూ ను కచితంగా అమలు చేయాలని, నాణ్యతతో భోజనం విద్యార్ధులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట ఎస్.డి.సి శ్రీమతి విజయజ్యోతి, ఆర్డిఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, స్థానికి రెవెన్యూ , విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
