కాపు, తెలగ, బలిజ, ఒంటరి అఫీషియల్స్ & ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.



 కాపు, తెలగ, బలిజ, ఒంటరి అఫీషియల్స్ & ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు: కాపు, తెలగ, బలిజ, ఒంటరి అఫీషియల్స్ & ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఏలూరు జనసేన పార్టీ నాయకులు శ్రీ నారా శేషు గారు ఘనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీ నారా శేషు గారు మాట్లాడుతూ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు చెందిన అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ సంక్షేమం కోసం ఈ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి ఇటువంటి సంఘాలు మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం 2026 ప్రతి ఒక్కరికీ శుభాలు, విజయాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జెట్టి సింహాద్రిరావు, కార్యదర్శి శ్రీ వరికూటి వి.వి. సత్యనారాయణ, కోశాధికారి శ్రీ పటగర్ల నాగభూషణరావు తో పాటు అసోసియేషన్ సభ్యులు, అఫీషియల్స్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post