చీమకుర్తి లోని గ్రానైట్ క్వారీని పరిశీలించిన కలెక్టర్ మరియు శాసనసభ్యులు.



 చీమకుర్తి లోని గ్రానైట్ క్వారీని పరిశీలించిన కలెక్టర్ మరియు శాసనసభ్యులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే వ్యర్ధాల నిర్వహణపైన యజమానులు దృష్టి సారించడం తో పాటు మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు పేర్కొన్నారు. 

 ప్రకాశం జిల్లా చీమకుర్తి లోని గ్రానైట్ క్వారీని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, శాసన సభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ తో కలిసి పరిశీలించారు. 

 ఈ సందర్భంగా మైనింగ్ అధికారులు క్వారీలో గ్రానైట్ రాళ్ళ వెలికి తీసే విధానం ను వివరించారు.  

అనంతరం జిల్లా కలెక్టర్ క్రిష్ణ సాయి గ్రానైట్ కంపెనీని సందర్శించి గ్రానైట్ కటింగ్ మరియు పాలిష్ విధానాన్ని పరిశీలించారు.  

 ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, 

 మైనింగ్ కార్యకలాపాల ద్వారా గత సంవత్సరం 180 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం రాగా, ఈ సంవత్సరం 220 కోట్ల రూపాయలు లక్ష్యంగా నిర్దేశించుకొనడమైనదన్నారు.  

జిల్లాలో మైనింగ్ కార్యకలాపాల ద్వారా ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

ఈ క్రమంలో యజమానులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు. 

మైనింగ్ కార్యకలాపాలతో పాటు వచ్చే వ్యర్ధాల నిర్వహణపైనా యజమానులు అంతే స్థాయిలో దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నారు. 

ఈ దిశగా ప్రోటోకాల్ పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 

మైనింగ్ వ్యర్థాలను డంపు చేసేందుకు ప్రత్యేక స్థలాన్ని కూడా అధికార యంత్రాంగం గుర్తిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  

మైనింగ్ కార్మికుల ఆరోగ్యంపై యజమానులు కూడా దృష్టి సారించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా అవసరమైన ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. 

భూముల ఆన్లైన్ ప్రక్రియలో నిబంధనల మేరకు పనిచేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు రెవెన్యూ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాల్సి ఉన్నందున ప్రజలు కూడా కొంత ఓపికతో ఉండాలని ఆయన సూచించారు. 

జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో ప్రజల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్న తీరుపై సానుకూల అభిప్రాయం పెరిగిందన్నారు.

శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా కార్యకలాపాలు ఉండాలన్నారు. డిఎంఎఫ్ నిధులతో ప్రజల అవసరాలు తీర్చడంపైనా దృష్టి పెట్టామన్నారు.

 మైన్స్ యజమానులకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం వైపు నుంచి అందించేలా ప్రతినెలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తామన్నారు. పర్యావరణం, కార్మికుల ఆరోగ్యం వంటి విషయాలలో గనుల యజమానులు ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించరాదని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ వెంట ఎస్.డి.సి శ్రీమతి విజయజ్యోతి, ఆర్డిఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, మైనింగ్ డిడి శ్రీ రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post