జే ఈ ఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో పటిష్టంగా అవసరమైన ఏర్పాట్లు. పరిశీలించిన కలెక్టర్. ఎస్పి.


 జే ఈ ఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో పటిష్టంగా అవసరమైన ఏర్పాట్లు. పరిశీలించిన కలెక్టర్. ఎస్పి.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలుజిల్లాలో త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు పేర్కొన్నారు. 

శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, జిల్లా ఎస్.పి.వి. హర్షవర్ధన్ రాజుతో కలసి జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్ష కు సంబంధించి ఏర్పాటుచేయనున్న పరీక్షా కేంద్రాలు ఒంగోలు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కేంద్రాన్ని, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల, రైజ్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, రైజ్ క్రిష్ణ సాయి గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, పేస్ ఇంజనీరింగ్ కళాశాల, బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లను సందర్శించి చేపట్టవలసిన ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఒంగోలు నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్ నందు జరుగుచున్న ఎపి ఉపాద్యాయ అర్హత పరీక్షను, అలాగే డిఆర్ఆర్ ఎం స్కూల్ లో జరుగుచున్న నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జేఈఈ మెయిన్స్ పరీక్షకు సంబంధించి జిల్లా లో 6 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 

 రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఆరు కేంద్రాలను జిల్లా ఎస్.పి తో కలసి సందర్శించి జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు.

  పరీక్షల నిర్వహణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. 

 గతంలో కూడా జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇవే కేంద్రాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. అయినప్పటికినీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పరిశీలన నిమిత్తం రావడం జరిగిందన్నారు.  

భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పి పరిశీలించటం జరుగుతుందన్నారు. బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పై గతంలో ఏసీ మరియు తాగునీటి నిర్వహణపై కొన్ని పిర్యాదులు రావడం జరిగిందని, వాటిని పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత మేనేజ్మెంట్ వారిని ఆదేశించడం జరిగిందన్నారు.   

 జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రతిష్టాత్మకమైన పరీక్ష కాబట్టి , దానికి పరీక్షకు సంబంధించి మార్గాదర్సకాలు పాటిస్తూ సంబంధింత అధికారులు జాగ్రతగా ఉంటూ అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు పేర్కొన్నారు. 

జిల్లా ఎస్.పి వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో జరగనున్న జేఈఈ మెయిన్స్ పరీక్ష కు సంబంధించిన 6 పరీక్షా కేంద్రాలను ఈరోజు జిల్లా కలెక్టర్ వారి తో కలసి సందర్శించి పరీక్షా నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. పరీక్షా నిర్వహణ కు సంబంధించి జారీ అయిన మార్గదర్శకాల మేర ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందన్నారు. పరీక్ష జరుగు సమయంలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన ఓబులేసు, విద్యా శాఖ అధికారులు, పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.,

Post a Comment

Previous Post Next Post