కంభంలో ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష.


 కంభంలో ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు 

         ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల,గురుకుల పాఠశాల,గర్ల్స్ హై స్కూల్లో శనివారం నిర్వహించిన జవహర్ నవోదయ 2025 ప్రవేశ పరీక్షను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించినట్లు ఎంఈవో అబ్దుల్ సత్తార్ తెలిపారు.ఆయా కేంద్రాలను పరిశీలించిన ఎంఈవో పరీక్ష సందర్భంగా ఏర్పాటుచేసిన వసతులు,సౌకరాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాల కేంద్రంలో 206 మంది విద్యార్థులకు 75 మంది విద్యార్థులు హాజరుకాగా, 135 విద్యార్థులు గైరు హాజరఅయినట్లు తెలిపారు .గర్ల్స్ హై స్కూల్లో 216 కు 161, గవర్నమెంట్ హై స్కూల్లో 216 కు 120 మంది విద్యార్థులు హాజరయ్యారని,మూడు కేంద్రాల్లో కలిపి 638 విద్యార్థులకు 356 విద్యార్థులు హాజరుకాగా,282 మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post