ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం .
క్రైమ్ 9 మీడియా మార్కాపురం రిపోర్టర్ ఎం కిరణ్ కుమార్.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం.పనిచేసేవారిని ఆశీర్వదించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి.
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 29 వ వార్డులో చంద్రన్న మార్కాపురం జిల్లా ప్రకటించినటువంటి సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు మార్కాపురం పట్టణంలోని 29 వ వార్డ్ లో చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పట్లో ప్రత్యేక జిల్లా కోసం 63 రోజులపాటు ఉద్యమం చేశామని చివరికి నిరాహార దీక్షలు చేసిన తర్వాత అమరావతికి సైకిల్ యాత్ర ప్రారంభించినప్పుడు పోలీసులు అరెస్టు చేసి హాస్పటల్లో బలవంతంగా ఏక్కించారని తదనంతరం ఉద్యమ తీవ్ర రూపం తెలిసిన నారా చంద్రబాబునాయుడు తన జన్మదిన సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ప్రత్యేక మార్కాపురం జిల్లా ఇస్తానని వాగ్దానం చేశారని ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే మార్కాపురం జిల్లా ప్రకటన చేశారని గుర్తు చేశారు.
వైసీపీ నాయకులకు ప్రత్యేక మార్కాపురం జిల్లాతో ఏమి తోచడం లేదని మార్కాపురం జిల్లా ద్వారా ఏం సాధిస్తారని అవాకులు చవాకులు పేలుతున్నారని మార్కాపురం జిల్లాతో ఈ ప్రాంతం లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వెనుకబడిన జిల్లా ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చి అభివృద్ధి సాధిస్తామని మార్కాపురం పట్టణం దినదినాభివృద్ధి చెంది ఇటు సీత నాగులవరం గ్రామం దాకా, అటు దేవరాజు గట్టు వరకు, ఒంగోలు రోడ్లు గనుల వరకు, ఇటు హనుమాన్ కుంట వరకు మార్కాపురం విస్తరిస్తుందని తద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతామని చివరకు రైతుల భూములు కూడా రెండు మూడు రెట్లు పెరుగుతాయని భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, మెరుగైన వైద్య సదుపాయాలు లభిస్తాయని అన్నారు.
ఈ ప్రాంతానికి ఏది తెచ్చిన తానే సాధించాలని వెలుగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్ అయినా, మార్కాపురం జిల్లా అయిన, మార్కాపురం జిల్లా ఆసుపత్రి అయిన, త్వరలోనే మార్కాపురం కు ఒక మిర్చి యార్డు సాధిస్తానని అన్నారు. ఏ వైసీపీ నాయకుడైన ఇంతవరకు మార్కాపురం కు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
మొన్న వచ్చిన మొందా తుఫాన్ అప్పుడు ఈ వైసీపీ నాయకులు ఎక్కడికి పోయారని మేము, ప్రజా ప్రతినిధులు, అధికారులు కష్టంచి పనిచేసి నియోజకవర్గంలో ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చూసామని గుర్తు చేశారు.
ఈ వైసీపీ నాయకులు మాత్రం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ కోటి సంతకాలు అంటూ రోడ్లపై పడి ప్రతి ఊర్లో లక్ష ల రూపాయలు ఖర్చుపెట్టి డప్పు కొట్టించుకుంటున్నారని దీనివల్ల ప్రజలకు ఏ ఉపయోగమో తమకు తెలవటం లేదని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.అనంతరం మహిళలు ప్రత్యేక మార్కాపురం జిల్లా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెల్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, 29వ వార్డు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, ఎన్డీఏ కుటమి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

