ప్రభుత్వ బాలుర వసతి గృహమును అకస్మిక తనిఖీ డి ఆర్ ఓ.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం ఒంగోలు అన్నవర్పాడులోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం నెంబర్ 7 ను జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వంట గదిని, తాగునీటి వసతులను, మరుగుదొడ్లను, స్టోర్ గదిని పరిశీలించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా , ప్రతి నెలా వైద్యులు వస్తున్నారా లేదా, వారి ఆరోగ్య పరిస్థితులు, కల్పిస్తున్న వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మాకు వసతులు బాగున్నాయని, ప్రతినెలా వైద్యులు వచ్చి పరీక్షలు చేసి వెళతారని డి ఆర్ ఓ కు చెప్పడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి విద్యార్థులతో కలసి భోజనం చేయడం జరిగింది విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు బాలుర వసతి గృహంను పరిశీలించడం జరిగిందన్నారు. వసతులు, భోజనం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వసతి గృహం లో మొత్తం 95 మంది విద్యార్థులు ఉన్నారు.
ఈ కార్యక్రమం లో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్, a s w o టి లింగయ్య , HWO డి అంకబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


