బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరియోబు ఆధ్వర్యంలో చీరలు దుప్పట్లు పంపిణీ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని గాయత్రీ నవోదయ కోచింగ్ సెంటర్ ఆవరణలో ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహా నీయునియులను స్మరించుకుంటూ మరియు క్రిస్మస్ సందర్భంగా కందులాపురం పంచాయతీ. ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న.పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కంభం మండల అభివృద్ధి అధికారి వీరభద్రా చారి. మరియు క్రైమ్ 9మీడియా ప్రకాశం జిల్లా ఇంచార్జి, బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు. సలహాదారుడు ఓ అల్లూరయ్య.ఎన్జీవోస్ దారు వేముల అనిల్ రాజ్. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్లా చైర్మన్ గూడూరి అన్నోజి రావు. చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ దాసరి యోబు సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలు అర్థవిడులో. కంభం లో నాలుగు సంవత్సరాల నుండి మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పారు.
అయితే ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే. భారత రాజ్యాంగ నిర్మాత బహుజనుల ఆశాజ్యోతి. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకుపోతూ వారి ఆశయాలు అనుగుణంగా నడుచుకుంటూ సామాజిక కార్యక్రమంలో ముందుకు సాగాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులను కార్యకర్తలను అభినందించారు.
మాజీ ఎస్సీ మారిటర్ కమిటీ సభ్యులు. అనిల్ రాజ్ మాట్లాడుతూ ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే గార్లను స్మరించుకుంటూ ఈరోజు చేసే కార్యక్రమానికి వచ్చిన పారిశుద్ధ కార్మికులు మరియు విద్యార్థిని విద్యార్థుల కు మహనీయులు కష్టపడి మహోత్తరమైన కార్యక్రమాలు మన బహుజనులకు చేసిన మేలులు మరువలేమని ఆయన వివరించారు.
అయితే దళితుడిగా పుట్టి మహోత్తరమైన దేశ సంపద అయినటువంటి భారత రాజ్యాంగమును గౌరవించాల్సిన అవసరం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉందన్నారు.
బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దాసరి యోబు మాట్లాడుతూ సంకల్పం అనేది ఉంటే ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరని అలాగే మనకున్న కొద్దిలో పేద ప్రజలకు సహాయం చేయటంలో సంతృప్తి ఉందని అన్నారు.
అలాగే పేదవారికి సహాయం చేయటంలో ప్రతి ఒక్కరూ ముందుండి నడిపించి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన. అతిథులకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్కాపురం ఆది ములుపు అనిల్ లూకా రాజ్. కత్తి అన్నోజి రావు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు. బహుజన పరిరక్షణ సమితి గిద్దలూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి. మరియు ఎన్జీవో దున్న యోబు. ఎన్జీవో చిట్లూరి ఏలియా. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మార్కాపురం డివిజన్ సెక్రెటరీ తత్తూరి వెంకటయ్య. బీఎస్పీ నాయకులు ఆర్ శ్రీనివాసులు.సామాజిక కార్యకర్త ఆదిములకు సాల్మన్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.






