స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్చ భారత్.స్వచ్ఛతాకి నోచుకోని ఏలూరు నగరం.
- NDA కూటమి ప్రభుత్వ ఆశయాలకి తూట్లు పొడుస్తున్న ఏలూరు నగర కమీషనర్.
- ప్రజల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపుతున్న అధికారులు.
- జిల్లా కేంద్రం అయిన ఏలూరు నగరం అపరిశుభ్రతకి మారుపేరు మారనుందా..?
- ప్రతినెలా మూడవ శనివారం ప్రజాప్రతినిధులతో స్వచ్చ భారత్ - స్వచ్చ ఆంధ్ర, స్వచ్చ ఏలూరు అని అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమం కేవలం పత్రికేయుల ఫోటోలకే పరిమితంగా మారింది.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జిల్లా ఏలూరు డిసెంబర్ 23.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంటే... మరోప్రక్క వారి ప్రయత్నాలకి తూట్లు పొడుస్తున్న అధికారులు. తూతు మంత్రంగా పారిశుధ్య పనులు. పర్యవేక్షణ లోపంలో నగర మునిసిపల్ కమీషనర్.
అధికారులు జీతాలు తీసుకోవడం లో చూపించే చొరవ కాస్త ప్రజల ఆరోగ్య విషయంలో చూపిస్తే చాలా బాగుంటుంది అని ప్రజల అభిప్రాయం... ఒకప్రక్క క్రిస్మస్ మరోప్రక్క చాలా సంవత్సరాలు తరువాత ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న జాతర కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగరంలోని ప్రజలు వారి వారి బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తున్న తరుణంలో... అపరి శుభ్రతత పై అధిక కార్యాచరణ నిర్వహించవలసిన సందర్బంలో... నగర మున్సిపల్ కమీషనర్ అలసత్వం చూస్తుంటే... ఏలూరు ప్రతిష్ట మరియు పాలక వర్గాల ప్రతిష్టను దిగజారెలా చేస్తున్నట్లు ప్రజలలో సందేహలతో కూడిన అభిప్రాయాలు నెలకొంటున్నాయి. ఉన్నత అధికారులు మరియు పాలక వర్గాలు ఏవిధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.







