ప్రజలు సంతృప్తి పొందేలా చూడాలి కలెక్టర్లకు ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.


 ప్రజలు సంతృప్తి పొందేలా చూడాలి కలెక్టర్లకు ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు, రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిచెందే విధంగా ప్రభుత్వ సేవలు అందించాలనిరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయా నంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాల యం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి, పెన్షన్లు పంపిణీ, దీపం పథకం, నిత్యావసరసరుకుల పంపిణీ, పారిశుద్ధ్యం ధాన్యసేకరణ తదిత రంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడు తూప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం గాఅందించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెన్షన్లను నూరుశాతం పంపిణీ అయ్యే విధంగా చర్యలుతీసుకోవాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులు వారంలో రెండు రోజులు ఇంటి నుండి చెత్త సేకరణ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో, గ్రామీణప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమా ల పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల కుసులభతరంగా సేవలుఅందించడానికి చర్యలు తీసుకోవాల ని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ధాన్య సేకరణకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లాకలెక్టర్ పి. రాజ బాబు మాట్లాడుతూ జిల్లాలో పారిశుద్ధ కార్యక్రమాలు ముమ్మ రంగా చేపట్టడానికి చర్యలుతీసుకుంటా మని ఆయన చెప్పారు. జిల్లాలో వరి ధాన్య సేకరణ అవసర మైన అన్ని రకాల చర్యలు తీసుకు న్నామని సందర్భంగా చెప్పారు. ప్రకాశం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ అర్.గోపాలకృష్ణ, జిల్లావ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లాపౌరసరఫ రాలఅధికారి పద్మశ్రీ, జిల్లా మేనేజర్ వరలక్ష్మి, సిపిఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post