క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బి అమృతరాజ్.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఫ్లెక్సీ వివాదంలో వైసీపీ నాయకుడు చేసిన దాడిలో గాయపడిన రాష్ట్ర ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, ఎస్సి సెల్.నాయకులు గోనా చెన్నకేశవులు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి వారిని పరామర్శించి, జరిగిన సంఘటనను గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో భౌతికదాడులకు పాల్పడటం హేయమైన చర్య అని, ఘటనకు పాల్పడిన వారి పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.
వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసరావు, జడ్పీటీసీ కొత్తపల్లి శ్రీను, సొసైటీ బ్యాంకు చైర్మన్ కేతం శ్రీను, ఏ ఎం సి వైస్ చైర్మన్ తోట శ్రీను, ఎస్సి నాయకులు సిరివెళ్ల రవికుమార్, కోలా ప్రసన్న కుమార్, గొట్టిముక్కల వెంగయ్య, పట్టణ అధ్యక్షులు మాధవ్, బీసీ నాయకులు బొందలపాటి రమణ, టీడీపీ కోటయ్య, మైనార్టీ నాయకులు ఎన్టీఆర్ గౌస్, బిజ్జాల కిషోర్, పట్టణ & మండల టీడీపీ నాయకులు పాల్గోన్నారు.
