ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమాన్ని ర్యాలీతో జండా ఊపి ప్రారంభించిన ఏలూరు సీనియర్ సివిల్ జడ్జ్ రత్నం ప్రసాద్.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరు: హెచ్ఐవి, ఎయిడ్స్ నివారిణి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎల్ఎస్ఎ జడ్జ్ కే రత్న ప్రసాద్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా కార్యక్రమాన్ని ర్యాలీతో జండా ఊపి ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జ్ రత్నం ప్రసాద్ ఫైర్ స్టేషన్ మీదుగా ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ నుంచి ఇండోర్ స్టేడియం చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సమాజంలో పౌరులు ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తమై ఉండి సామాజిక బాధ్యతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు సాంకేతిక ద్వారా సక్రమమైన రీతిలో అవగాహన పొందాలని విద్యార్థిని విద్యార్థులను కోరారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ టిబి అధికారి డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హెచ్ఐవి పరీక్ష చేయించుకుందాము సమాచారం తెలుసుకుందాం సురక్షితంగా జీవిద్దాం అని నినాదంతో ముందుకు వెళ్లాలని మారుమూల ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో మరియు కర్మగారాలలో వలస కార్మికులకు సంచార హెచ్ఐవి ఎయిడ్స్ పరీక్ష కేంద్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని రాబోయే రోజులలో ఎక్కువ హెచ్ఐవి పరీక్షలు చేసే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నామని అన్నారు. జిల్లా సబ్ జైల్ల అధికారి సి హెచ్ ఆర్ వి స్వామి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తమై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. అనంతరం ఈ సందర్భంగా దిశా అనుబంధ విభాగాలైన ఐ సి టి సి, ఏఆర్ టి, డి ఎస్ ఆర్ సి, పీహెచ్సీ, స్వచ్చంద సంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి మెమొంటోలు, నగదు బహుమతులు, ధ్రువ పత్రాలతో సత్కరించారు. అందరూ హెచ్ వై ఫై అవగాహన కలిగి క్షేత్రస్థాయిలో దానిని నిర్మూలించేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్ శోభ, డాక్టర్లు సత్యనారాయణ, బ్యుల ఫ్లారెన్స్, ఎం శ్రీనివాస్, నజరేన్, దిశ జిల్లా సూపర్వైజర్ ఏ హరినాథ్ కుమార్, జిల్లా ఎం అండ్ ఈ , అధికారి సామర్ల విజయలక్ష్మి, షేర్ ఇండియా పీఓ జి జగదీష్, ప్రిజన్ కోఆర్డినేటర్ కె వినోద్ కుమార్, డిఆర్పి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

