వైద్య కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల మధ్య ఘర్షణలు- ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివకుమార్.

వైద్య కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల మధ్య ఘర్షణలు- ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి.శివకుమార్.

ఏలూరు :క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

      ప్రభుత్వ వైద్య కళాశాల యాజమాన్యం నిర్లక్షం వల్లే విద్యార్ధుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ విమర్శించారు. ఏలూరులోని వైద్య కళాశాలలో విద్యార్థుల పట్ల ర్యాగింగ్ కు పాల్పడటం బాధాకరమన్నారు.  

వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థుల మధ్య ర్యాగింగ్ జరుగుతుందని తెలిసినప్పటికీ కళాశాల యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లే సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ అనే పేరుతో జూనియర్ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు చదవాలంటే ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ఏడాది వైద్య కళాశాల హాస్టల్లో ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు ఇబ్బందికి గురవటం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. హాస్టల్లో భోజన సౌకర్యాలు సక్రమంగా లేవంటూ వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ విమర్శించారు.  అందువల్ల తక్షణమే ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడంతో పాటు జిల్లా అధికారులు కళాశాలకు పరిశీలించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని శివ కుమార్ డిమాండ్ చేశారు.

 

Post a Comment

Previous Post Next Post