నియోజకవర్గ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా-ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి.


నియోజకవర్గ కాలనీల అభివృద్ధికి కృషి చేస్తా-ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి.

క్రైమ్ 9 మీడియా.. తెలంగాణ ప్రతినిది.. నవంబర్ 2..

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీ ల అభివృద్ధికి కృషి చేస్తా అని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అన్నా రు. ఆదివారం కాప్రా డివిజన్ పరిధిలోని కాప్రా చెరువు అలుగు నుండి ఎల్లారెడ్డి గూడ సి.సి రోడ్ వరకు మరియు శ్రీ సాయి నగర్, ఆర్టీసీ కాలనీ అభివృద్ధి పనులకు ప్రారంభానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ సీ.సీ రోడ్ల నిర్మాణం తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాలనీల సమస్య సమస్యల పట్ల తనకు ఒక ప్రణాళిక ఉన్నది అని నెరవేరేలా అభివృద్ధికి కృషి చేసేలా నియోజకవర్గ పరిధిలో నిధులు మంజూరు అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ప్రజల సమస్య నా ఎజెండాల నియోజకవర్గ ప్రజల సమస్యలు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ మొదట సమస్యగా ఉందని జి.హెచ్.ఎంసి. అధికారుల మరియు హెచ్.ఎం.డి.ఎ అధికారు ల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు వివిధ కాలనీ అధ్యక్షులు, కాలనీవాసులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Add


 

Post a Comment

Previous Post Next Post