కార్తీక మాసం సందర్భంగా నదులు, సముద్రతీర ప్రాంతాలు మరియు శివాలయాల వద్ద భద్రతా చర్యలు పటిష్ఠం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 కార్తీక మాసం సందర్భంగా నదులు, సముద్రతీర ప్రాంతాలు మరియు శివాలయాల వద్ద భద్రతా చర్యలు పటిష్ఠం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి, నవంబర్ 02: కార్తీక మాసం సందర్భంగా భక్తులు జిల్లా పరిధిలోని సముద్రతీరప్రాంతాలు, నదులు, శివాలయాలకు అధిక సంఖ్యలో తరలి వస్తారని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు సమగ్ర భద్రతా చర్యలు చేపట్టబడ్డాయి. సముద్రతీర ప్రాంతాలు మరియు ప్రధాన నదీ తీరాల్లో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు భక్తుల రక్షణ కోసం గజ ఈతగాళ్ళు నియామకంమహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు వినోదప్రదేశాలు, వనభోజన ప్రదేశాలు, పిక్నిక్ స్పాట్లలో పెట్రోలింగ్ పెంపు శివాలయాల వద్ద ఎటువంటి దొంగతనాలు, పిక్‌పాకెటింగ్, ఈవ్ టీజింగ్ జరగకుండా నిఘా.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా కార్తీక మాసం ఆచరించేందుకు కావలసిన అన్ని చర్యలు చేపట్టింది. భక్తులు పోలీసు శాఖ సూచనలను పాటించడం ద్వారా తమ భద్రతను కూడా నిర్ధారించుకోవాలని కోరుతున్నాము. ఎటువంటి నిబంధనల ఉల్లంఘన, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము," అని తెలిపారు.

అలాగే కార్తీక మాసంలో సోమవారాలు మరియు ముఖ్య పర్వదినాల్లో శివాలయాల వద్ద భారీగా భక్తులు చేరుతారని దృష్టిలో ఉంచుకుని:ప్రధాన శివాలయాల వద్ద అదనపు సిబ్బంది నియామకం.ట్రాఫిక్ నియంత్రణ చర్యలు.సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ.

పిక్నిక్, వనభోజన ప్రాంతాల్లో యువత మధ్య గొడవలు, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ.

భక్తులు భద్రతా చర్యలను గౌరవించి, పోలీసులతో సహకరించాలని కోరుతూ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post