క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
నవంబర్ 5 6 తేదీలలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జయప్రదం చేయండి ఏ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు.
నవంబర్ 2 జంగారెడ్డిగూడెం టౌన్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత మండల కమిటీ సభ్యులు పిల్లి పోతురాజు మండల కార్యదర్శి ఏ ప్రభాకరరావు మాట్లాడుతూ
పత్రికా ప్రకటన విడుదల చేశారు టీ నర్సాపురం మండలంలో నవంబర్ 5, 6 తేదీలలో నిర్వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, పెద్ద ఎత్తున పాల్గొని 5వ తారీఖున బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు నిరంతరం ఉపాధి, కూలీలు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి అని ప్రదేశాలలో ప్రమాదాలకు గురవుతున్న కూలీలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిరంతర పోరాటాలు చేస్తున్న సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అని ఈ సంఘం 32వ మహాసభలు టీ నర్సాపురం మండలంలో నిర్వహించడం మొట్టమొదటిసారిగాని కనుక మండలంలో కార్మిక,కర్షక,ఉద్యోగ, ప్రజానికం, ప్రజా ప్రతినిధులు వారి వారి సహకార్యాలతో ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ జిల్లా మహాసభలలో జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అభివృద్ధితో రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు జోడిద్దుల బండి లాంటి వారిని రైతులు వ్యవసాయ కార్మికులు శ్రమ వల్లే సామాన్యుని నుండి దేశ ప్రధాని వరకు ఐదేళ్లు నోట్లోకి వెళ్ళడానికి వారి శ్రమేనని కార్మికుల శ్రమను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు గుర్తించాలని అలాగే వారి హక్కులుకు భంగం కలగకుండా భూమి కూలి సమాన పనికి సమాన వేతనం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన భూములు అసైన్, సీలింగ్,గయాళ భూములపై ప్రభుత్వం సర్వే చేసి ప్రతి కుటుంబానికి భూమిని పంచాలని ఈ మహాసభల్లో తీర్మానాలు చేసి రానున్న కాలంలో పేదల పక్షాన వాళ్లకు న్యాయం జరిగే దిశగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు కనుక మన టీ నర్సాపురం మండలంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం 32వ మహాసభలు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గుదే బాలయ్య, ఎం బాలరాజు, పి, గట్టియా, సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
