స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్.
క్రైమ్ 9 మీడియా, సంగారెడ్డి ప్రతినిధి.
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కోరారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల, దౌల్తాబాద్, కాసాల, హత్నూర గ్రామాల్లోని నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మకమైన గ్రామాల పట్ల నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామాలను సందర్శిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట పఠాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, జిన్నారం సీఐ రమణారెడ్డి, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఉన్నారు.
