![]() |
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, నవంబర్ - 28.
పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను, వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 22లక్షల, 30వేల, 480 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకూ నియోజకవర్గ పరిధిలో మొత్తం 360 మంది బాధితులకు 3కోట్ల, 77 లక్షల, 93వేల, 178 రూపాయల విలువైన సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను, ఎల్‌వోసీలను అందించి ఆదుకున్నామన్నారు. ఒకపక్క సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూనే,,, మరోపక్క అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా మరింత భరోసా కల్పిస్తున్నామన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవల ద్వారా కూడా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలను పేదలకు, అవసరార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది ఏప్రియల్ నెల నుండి 25లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వాధినేతలు చర్యలు చేపట్టడం శుభపరిణామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, టిడిపి నాయకులు బెల్లపుకొండ కిషోర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇన్చార్జులు, వివిధ హోదాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
