ప్రపంచంలోకెల్లా సర్వోన్నతమైనది భారత రాజ్యాంగం.


ప్రపంచంలోకెల్లా సర్వోన్నతమైనది భారత రాజ్యాంగం.

సంగారెడ్డి జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

-జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య.

 క్రైమ్ 9 మీడియా, సంగారెడ్డి ప్రతినిధి:

      భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే సర్వోన్నతమైనదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి  అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ  కళాశాలలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది కలిసి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివి, రాజ్యాంగ విలువలను పాటించేందుకు అంకిత భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగమన్నారు. భారత రాజ్యాంగం ఎప్పుడు నూతన మైనదే అన్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా  మన రాజ్యాంగంలో మార్పులు, చేర్పులను చేసుకొనే వెసులుబాటు రాజ్యాంగంలో మార్పులు చేర్పులను చేసుకొనే వెసులుబాటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు. మన రాజ్యాంగం పరిధిలోకి ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాన అవకాశాలు, సమాన అధికారాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ విద్యార్థుల పాత్ర ఎనలేనిదన్నారు. సంగారెడ్డి న్యాయ కళాశాలలో ప్రతిభ గల అధ్యాపక బృందం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. న్యాయ కళాశాల విద్యార్థులు తమ శిక్షణ కార్యక్రమంలో న్యాయవిద్య మేలుకువలు సాధించి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ఉత్తమమైన న్యాయవాదులుగా, న్యాయాన్ని న్యాయపుణులుగా గుర్తింపు పొందాలని కలెక్టర్ సూచించారు. న్యాయ విద్యా డిగ్రీ తో సరి పెట్టుకోకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో న్యాయ సంగారెడ్డి న్యాయ కళాశాల విద్యార్థులు స్థిరపడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post