ఎంపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.


 ఎంపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

‎ఏలూరు, నవంబర్ 26: బుధవారం (నవంబర్ 26) భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో వేడుక నిర్వహించారు. ఎంపీ కార్యాలయ సిబ్బంది, స్థానిక నేతలు రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ సహా బాబు రాజేంద్రప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, జి వి మావలాంకర్ వంటి ఎంతోమంది మేధావులు, న్యాయ నిపుణులు ఎంతో ముందు చూపుతో అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి తయారుచేసిన గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలబడి ఉండటానికి ప్రధాన కారణం మన రాజ్యాంగ సూత్రాలే అన్నారు.

Post a Comment

Previous Post Next Post