లారీ ఢీకొని బోల్తా పడ్డ ట్రాక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట కృష్ణ శెట్టిపల్లె రోడ్డు లో నంద్యాల నుండి పశువుల గడ్డి లోడ్ తో వస్తున్న ట్రాక్టర్ను లారీ వెనుక భాగం తగిలి బోల్తా పడ్డది. ఇదే క్రమంలో దిగువమెట్ట నుండి గిద్దలూరు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రక్కన వస్తున్న నేపథ్యంలో అతనిపై డాక్టర్ బోల్తాపడడంతో గడ్డి పడి కాలు కు గాయాలైనాయి. ఆ రోడ్డులో వెళ్లే ప్రయాణించే వాహనదారులు. మానవత్వంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించడంతో అంబులెన్స్ వచ్చి గాయపడ్డ వ్యక్తిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం పెట్రోలింగ్ పోలీస్ వారికి విషయం తెలియడంతో. ట్రాక్టరు తగిలించిన లారీని పట్టుకొని దర్యాప్తు చేస్తున్నారు.