తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం..



 తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం..

కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

క్రైమ్ 9మీడియా.. నవంబర్ 19 .తెలంగాణ ప్రతినిధి..

తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారె పెట్టి గౌరవించాలన్న ఆలోచనతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు 2034 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరుడు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు కూడలి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో ఇతర మంత్రులతో కలిసి ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పలువురు మహిళా సమైక్య ప్రతినిధులకు చీరలు అందించి రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ఈ సందర్భంగా ప్రారంభించారు. తెలంగాణతల్లి అవతరణ దినోత్సవం తొమ్మిదో తేదీ డిసెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా మొదట విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. మార్చి 1 నుంచి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు మున్సిపల్, పట్టణాల ప్రాంతాల్లో చీరల పంపిణీ చేస్తామని అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాలు, పెట్రోల్ బంకులు అప్పగించడం మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం, ఆర్టీసీలో ఉచిత బస్ సౌకర్యమే కాకుండా బస్సులకు యజమానులను ఆడబిడ్డలు చేసిన ఘనత మా ప్రభుత్వమే అని అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ అందించడానికి ప్రత్యేకంగా కార్యచరణలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా దేశములో అనేక విప్లవాత్మకమైన స్ఫూర్తిదాయకమైన నిర్ణయాలు తీసుకున్నారని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి రక్తపు బొట్టు వరకు తమ వంతు కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ లోని ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం తరఫున చీర సారె అందుతుందని, ఎవరు అనుమాన వ్యక్తం చేయొద్దని అని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మహిళలకు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో తమ వంతు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాలు ఉంటాయని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళ సమైక్య ప్రతినిధులతో చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తో పాటు మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో పాటు, మహిళా ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post