ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పేద వితంతువుకు ఇంటి పట్టా అందజేత – పెన్షన్ మంజూరు దిశగా చర్యలు.
ప్రకాశం జిల్లా, దర్శి మండలం.జీవితంలో ఎదురైన కష్టాలకుపైగా, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా పోరాడుతున్న ఓ యువ వితంతువుకు ప్రభుత్వం అండగా నిలిచేలా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. గోపాలకృష్ణ తీసుకున్న నిర్ణయం అందరినీ హత్తుకుంటోంది.
అయ్యా… మాకు ఒక అండ కావాలి” – గ్రీవెన్స్ వద్ద కన్నీరు పెట్టుకున్న స్వప్న.
మాలపాటి స్వప్న – వయసు కేవలం 23 ఏళ్లు.
తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన స్వప్న, పెళ్లై ఐదేండ్లకే భర్త అనిల్ బాబును కోల్పోయింది. ఇద్దరు చిన్నారులతో జీవనం కష్టాల్లో కూరుకుపోయి, ఉపాధి కోసం పరితపిస్తూ ఈనెల 17వ తేదీ ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చింది.
ఆమె మాటలు విని జాయింట్ కలెక్టర్ గుండె కదిలిపోయింది.
చింతించకు అమ్మా… ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట… అదే రోజు నిలబెట్టిన అధికారులు
ప్రకాశం జాయింట్ కలెక్టర్ ఆదేశించగానే
దర్శి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ మరియు రెవెన్యూ సిబ్బంది అదే రోజున ఆమె ఇంటికి వెళ్లి
25 కిలోల బియ్యం
2 కిలోల పప్పు
2 కిలోల వంటనూనె ఆర్థిక సహాయంఅందించారు.
ఇంటిపట్టా అందజేత – వితంతు పెన్షన్‌కు దారితీశిన నిర్ణయం.
గురువారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ స్వయంగా స్వప్నకు ఇంటి పట్టా పత్రం అందజేశారు.
అంతే కాదు గృహ నిర్మాణ శాఖకు ఇల్లు మంజూరు చేయాలంటూ ఆదేశాలు. వితంతు పెన్షన్ తక్షణం మంజూరు చర్యలు తీసుకోవాలని నిర్దేశనలు.
భవిష్యత్తులో నిలబడేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు ఇంత చేయబోతారని ఊహించలేదు సార్ కన్నీళ్లతో ధన్యవాదాలు తెలిపినస్వప్న ప్రభుత్వం ఇచ్చిన అండతో తన పిల్లల భవిష్యత్తుపై విశ్వాసం పెరిగిందని,జీవితంలో మొదటిసారి గట్టి ఆత్మస్థైర్యం కలిగిందని,జాయింట్ కలెక్టర్‌కు ఆమె కన్నీరు పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలిపింది.
