రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా మంచిర్యాల్ ఎమ్మెల్యే.. ప్రేమ్ సాగర్ రావు.. క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.
క్రైమ్ 9 మీడియా.. తెలంగాణ ప్రతినిధి..బి. రవికుమార్.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపరంగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ హోదాతో కూడిన పదవులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ రామకృష్ణారావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు పదవులకు క్యాబినెట్ హోదా కల్పించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో చోటు కోసం సీనియర్ నాయకులు ఎదురుచూసినప్పటికీ వారికి మంత్రి పదవితో సమానంగా క్యాబినెట్ హోదా కల్పించి అధిష్టానం నిర్ణయం తీసుకుంది .వారి అనుభవాన్ని ప్రభుత్వానికి ఉప్పయోగించుకోవడంతో తో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంచిగా అడిగా వర్గంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో లేని సందర్భంలో పార్టీని తన భుజాలపై వేసుకొని పార్టీని కాపాడి కార్యకర్తలను నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి జిల్లాలోనే అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన ప్రేమ్ సాగర్ రావ్ కి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించినందుకు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రేమ్ సాగర్ రావు పార్టీ కల్పించిన సముచిత స్థానం మంత్రి హోదాలో కల్పించినందుకు కార్యకర్తలు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
