నవ దంపతుల వాహనానికి యాక్సిడెంట్.


 నవ దంపతుల వాహనానికి యాక్సిడెంట్.

ఆగి ఉన్న బోలెరోను  ఢీ కొట్టిన బోర్ లారీ. 

 ఆరు పల్టీ లు కొట్టిన బొలెరో - ముగ్గురు మృతి.

 ఐదుగురు పరిస్థితి విషమం,20మందికి గాయాలు.

 కురవి మండలం సుధన పళ్లి వాసులుగా గుర్తింపు.

నవ దంపతులను తీసుకొస్తున్న బొలెరో వాహనాన్ని బోర్ లారీ ఢీ కొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లోని సూధనపల్లి గ్రామానికి చెందిన యువతికి కురవి ఆలయంలో బుధవారం పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం అత్తగారింటికి వెళ్లిన నవ దంపతులను తీసుకొని రావడన్ని పెళ్లికూతురు బృందం దంపతులను తీసుకొస్తున్న క్రమంలో మార్గం మధ్యలో బహిర్భూమి కోసం బోలోరే వాహనాన్ని ప్రక్కకు ఆపారు. హన్మకొండ జిల్లా భీమదేవర పల్లి మండలం లోని ఎల్కతుర్తి వద్ద ఆగి ఉన్న బోర్ లారీ వెనుక నుండి ఢీ కోనడం తో బొలెరో వాహనం 6 పల్టీ లు కొట్టింది.వాహనం లో ఉన్న శ్రీనాథ్, స్వప్న కళ మ్మ, అక్కడిక్కడే మృతి చెందారు. 5గురి పరిస్థితి విషమంగా ఉందని,20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వరంగల్ ఎంజిఎం హస్పిటల్ కు తరలించారు.

Post a Comment

Previous Post Next Post