క్రైమ్ 9 మీడియా.. మహబూబాద్ జిల్లా ప్రతినిధి.. నవంబర్ 16.. భారత విద్యార్థి ఫెడరేషన్ డోర్నకల్ మండల విస్తృతస్థాయి సమావేశం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్.ఎఫ్.ఐ మహబూబాద్ జిల్లా కమిటీ అధ్యక్ష ,కార్యదర్శులు గంధసిరి జ్యోతి బస్, పట్ల మధు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేంతవరకు ఎస్.ఎఫ్.ఐ ఉద్యమాలు ఉధృతం చేస్తామని కళాశాల ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా భవిష్యత్తులో పోరాటాలు ఉదృతం చేస్తామని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మండల సమావేశంలో డోర్నకల్ ఎస్.ఎఫ్.ఐ మండల అధ్యక్షుడిగా కొడవండ్ల ఉదయ్, మండల నాయకులు రాకేష్ సాయి సందీప్ వినయ్ ప్రవీణ్ ఆనంద్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలి. ఎస్ఎఫ్ఐ మహబూబాద్ జిల్లా కమిటీ డిమాండ్.
