జనగామ జిల్లాలో మరో ఘోర బస్సు ప్రమాదం.


 జనగామ జిల్లాలో మరో ఘోర బస్సు ప్రమాదం.

క్రైమ్9మీడియా నవంబర్ 16.. జనగామ జిల్లా- హైదరాబాద్‌ జాతీయ రహదారి రక్తమోడింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ శివారులో ఆదివారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీ ఆర్టీసీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడి కక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికుల వివరాల ప్రకారం....తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 'రాజధాని' ఎక్స్‌ప్రెస్ బస్సు హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నిడిగొండ వద్ద జాతీయ రహదారిపై అజాగ్రత్తగా ఆపి ఉంచిన ఇసుక లారీని బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ఎడమవైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జై ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య క్తులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

మరో ఐదుగురు ప్రయాణి కులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రఘునాథపల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన బస్సులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు .

Post a Comment

Previous Post Next Post