కార్తీక మాసం సందర్భంగా చింతలపూడిలో ఘనంగా కాపు వన సమారాధన.






 కార్తీక మాసం సందర్భంగా చింతలపూడిలో ఘనంగా కాపు వన సమారాధన.

ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు, ఏలూరు మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి గారు, చింతలపూడి మార్కెట్ యార్డు చైర్మన్ చీదరాల దుర్గా భవానీ మధు బాబు.

చింతలపూడి, నవంబర్ 26 :- చింతలపూడి పట్టణంలో శెట్టి వారి గూడెం రోడ్ లోని మామిడి తోట నందు శ్రీకృష్ణదేవరాయ చింతలపూడి పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో కాపు కార్తీకమాస వనభోజన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వనసమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు, ఏలూరు ఏ.ఎం.సి. చైర్మన్ శ్రీ మామిళ్ళపల్లి పార్థసారధి గారు, చింతలపూడి ఏ.ఎం.సి చైర్మన్ శ్రీ చీదరాల దుర్గా పార్వతి మధుబాబు గారు మరియు చిన్నమిల్లి వెంకట రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వీరికి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. చిన్నారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళామణులకు రకరకాల ఆటపోటీలను నిర్వహించి పలువురికి పట్టు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా చింతలపూడి కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనభోజన కార్యక్రమాలు ఒక కుటుంబం లాగా అందరూ సమిష్టిగా ఒక వద్దకు చేరుకొని ఒకరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటానికి అనువుగా ఈ కార్తీకమాసం వన సమారాధన ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే కాపులందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ, కులాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని తెలియజేశారు. మన కులాన్ని కాపాడుకుంటూనే ప్రతి కులాన్ని గౌరవిస్తూ, జీవనం సాగించాలని మనమందరం ఒకటే అన్న భావన ప్రతి ఒక్కరులోనూ ఉండాలని వారు ఆకాంక్షించారు.  

ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, కొత్తపూడి శేషగిరి రావు, తోట శివ నాగరాజ (నాని) , మంచినపల్లి రాఘవేంద్రరావు, ముత్యాల శ్రీనివాస్ (చిన్ని), తోట పూర్ణచంద్రరావు, కోట శ్రీనివాస్, బొల్లం శంకర్, భారీ సంఖ్యలో కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post