ప్రముఖ కవి రచయిత అందెశ్రీ ఇకలేరు.
క్రైమ్ 9 మీడియాతెలంగాణ ప్రతినిధి. బి. రవి కుమార్.
నవంబర్ 10. తెలంగాణ సాహితీ శిఖరం ప్రజల కవి, రచయిత అందే శ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు ఆయన మరణం సాహితి లోకానికి కాదు మనందరికీ తెలంగాణ ప్రజలకు కవులకు, కళాకారులకు తీరని లోటుగా భావించాలి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ" రాష్ట్ర గీతాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో రచించిన తెలంగాణ ప్రజలకు తన వంతుగా కవిగా రచయితగా మనందరికీ సుపరిచితుడు నిత్యం చైతన్యాన్ని జ్వలింపజేసిన చేసిన గొప్ప యోధుడు అందెశ్రీ నిత్యం పేదల పక్షాన గొంతు ఇచ్చిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషిగా అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికార గీతమైన గేయంగా నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ "క్రైమ్ 9మీడియా "తరఫున ఘనంగా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తున్నాం
