సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :10

 సైబర్ మోసాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాల రూపంలో సహకరిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, హెచ్చరించారు.

ఇటీవల వ్యాపార పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం జరిగిన ఘటనలో, పోలీసులు సాంకేతిక ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కీలక వివరాలను వెలికితీశారు. బాధితుడు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో, ఆ మొత్తము అనేక బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లకు చేరినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత ఆ డబ్బు క్రిప్టో కరెన్సీ రూపంలో మారి విదేశీ నేరగాళ్లకు చేరినట్లు గుర్తించబడిందని ఎస్పీ గారు తెలిపారు. “తమ బ్యాంకు ఖాతాలను ఇతరుల లావాదేవీల కోసం ఉపయోగించేందుకు ఇవ్వడం, అవగాహన లేకపోయినా, నేరానికి సహకరించినట్లే పరిగణించబడుతుంది. ఇలాంటి చర్యలు కఠిన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయి.”

అలాగే, బ్యాంకు ఖాతాదారులు అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం అత్యవసరమని, ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అప్రమత్తతతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సైబర్ మోసం జరిగిన వెంటనే: 1930 హెల్ప్‌లైన్‌కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయండి

సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకండి – జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
 

Post a Comment

Previous Post Next Post