నవంబర్ 9న డి. జె .ఎఫ్ వర్కింగ్ యూనియన్ సభను విజయవంతం చేయండి- జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి.


 నవంబర్ 9న డి. జె .ఎఫ్ వర్కింగ్ యూనియన్ సభను విజయవంతం చేయండి- జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి.

క్రైమ్ 9 మీడియా తెలంగాణ ప్రతినిధి బి. రవికుమార్. నవంబర్.7.

      డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్టుల సభను" అక్షర దివిటీలం ప్రజాస్వామ్య వారదులం" అనే నినాదంతో స్థాపించిన జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ సభను ఈనెల 9న వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగిందని జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అన్ని జిల్లా కమిటీల నియామకాలు ఈ మహాసభలలో ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు ఆహ్వానితులే అని అన్నారు .చిన్న ,మధ్య తరగతి చిన్న పత్రికలను సైతం ప్రభుత్వం విస్మరిస్తుందని ప్రతి ఒక్క జర్నలిస్టుకి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ రాయితీలు అందాలని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం తరఫున పథకాలను కల్పించాలని ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కి సంబంధం లేకుండా జర్నలిస్టులకు చిన్న పెద్ద తేడా లేకుండా పత్రికలకు సంబంధం లేకుండా రాయితీలు కల్పించాలని ఈ మహాసభలో తీర్మానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ మహాసభ కి యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టులు అందరూ ఆహ్వానితులని మానసాని కృష్ణారెడ్డి అందరు పాల్గొని జర్నస్ట్ ఐక్యతను కాపాడే విధంగా ఒక తాటిపైకి వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జనిష్ట సమస్యలను కాపాడుకునే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post