నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి,(నాతవరం) నవంబర్ :07
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు వారి ఆదేశాల మేరకు, నాతవరం ఎస్సై వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో, ఇటీవల మోటార్ సైకిళ్లకు సంభవిస్తున్న వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలను నివారించేందుకు నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు మరియు ములగపూడి నుంచి గన్నవరంకి మెట్ట వరకు (తునీ-నర్సీపట్నం ప్రధాన రహదారి) పొదలు, మొక్కలు, ఆకులు తొలగించే జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు.
ఈ చర్య ద్వారా రోడ్డు పక్కలకు అడ్డుగా పెరిగిన మొక్కలు, పొదలు తొలగించబడటంతో రహదారి సౌకర్యంగా మారి, వాహనదారులకు స్పష్టమైన దృశ్యం కనిపించేలా మారింది. రాత్రి సమయంలో కూడా ప్రమాదాలు జరగకుండా ఈ చర్య సహాయపడుతుందని భావిస్తున్నారు.
రోడ్డు భద్రత కోసం ప్రజలు ఎల్లప్పుడూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్‌లు ధరించాలని, అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
