ఘనంగా జే.ఎన్టీ.యూ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.



 ఘనంగా జే.ఎన్టీ.యూ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.

నవంబర్ 21. క్రైమ్ 9 మీడియా తెలంగాణ ప్రతినిధి.

 కూకట్పల్లిలోని జెఎన్టి.యు హైదరాబాద్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీ ఉత్సవాలకు పూర్వ విద్యార్థులు హాజరైనందుకు సంతోషకరంగా ఉందని వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు సమాజానికి తమ వంతు సహాయం చేయాలని అన్నారు. జేఎన్టీయూ అధికారులతో పాటు పూర్వ విద్యార్థులను అభినందించారు. విద్యార్థి దశ నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఎంతోమంది ఉన్నత స్థాయిలో జే.ఎన్టీ.యూ నుంచి ఉండడం గర్వకారణం అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, టీ.పి..సి.సి. ఉపాధ్యక్షులు బండి రమేష్ కుకట్పల్లి నాయకులు పుష్పారెడ్డి, ఫణి కుమార్ దినేష్, తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post