69వ రాష్ట్ర పాఠశాల క్రీడలు – అండర్ 17 బాస్కెట్‌బాల్ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నూజివీడులో ప్రారంభించిన మంత్రి కోలుసు పార్ధసారథి.




 69వ రాష్ట్ర పాఠశాల క్రీడలు – అండర్ 17 బాస్కెట్‌బాల్ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ నూజివీడులో ప్రారంభించిన మంత్రి  కోలుసు పార్ధసారథి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

నూజివీడు, ఏలూరు జిల్లా: నూజివీడులో 69వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల క్రీడల అండర్–17 బాస్కెట్‌బాల్ బాలురు & బాలికల ఇంటర్-డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ మరియు రాష్ట్ర జట్ల ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

        ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గృహ నిర్మాణ, సమాచార ప్రజాసంబంధాల శాఖ మంత్రి  కోలుసు పార్ధసారథి  టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  ఘంటా పద్మశ్రీ, జిల్లా విద్యా అధికారిణి  ఎం. వెంకట లక్ష్మమ్మ, క్రీడా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ—ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పోటీతత్వం, శారీరక దారుఢ్యం పెంపుకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు విద్యార్థుల్లో టీం స్పిరిట్, వేగం, స్పూర్తి పెంచుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని పాఠశాలల్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి జిల్లా పరిషత్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

 ప్రతీ జిల్లాకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. రాబోయే రోజుల్లో జరగనున్న మ్యాచ్‌లలో ప్రతిభావంతమైన ఆటగాళ్లను రాష్ట్ర జట్ల ఎంపిక కోసం గుర్తించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన విద్యాశాఖ అధికారులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, స్థానిక నిర్వాహక బృందానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  ధన్యవాదాలు తెలిపారు.

Add.


Post a Comment

Previous Post Next Post