జిల్లాలో చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక దాడులు – గ్యాంబ్లింగ్ & కోడిపందేలు నిర్వహించిన నిందితులు అరెస్ట్.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు ప్రతి మండలంలో నిఘా కఠినతరం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి,(రాంబిల్లి, నాతవరం) నవంబర్:21.
జిల్లాలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, ముఖ్యంగా జూదం, గ్యాంబ్లింగ్ మరియు కోడిపందేల నిర్వహణపై అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టారు. ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు జరిగిన వీటి ఫలితంగా పలు మండలాల్లో నిందితులు అరెస్ట్ కాగా, నగదు మరియు వస్తువులు స్వాధీనం చేశారు.
1. రాంబిల్లి మండలం – కోతపేట గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో గ్యాంబ్లింగ్ రైడ్.
ఎస్సై నాగేంద్ర నేతృత్వంలో రాత్రి నిర్వహించిన దాడిలో అక్రమంగా జూదం ఆడుతున్న 4 గురు వ్యక్తులను పట్టుకున్నారు.
స్థలంలో నుండి:₹31,390/- నగదు,
జూదం సంబంధిత వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
2. నాతవరం మండలం – మార్రిపాలెం, SC కాలనీ వద్ద రాత్రి గ్యాంబ్లింగ్ రైడ్.
ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ రైడ్‌లో 6 గురు నిందితులను అరెస్ట్ చేశారు.
స్థలంలో నుండి: 10,300/- నగదు.
ప్లేయింగ్ కార్డులు, గ్యాంబ్లింగ్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
3.నాతవరం మండలం – పెద్ద గోలుగొండపేట అవుట్‌స్కర్ట్స్ కోడిపందేల దాడి ఈ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.
స్వాధీనం చేసినవి: 2 కోళ్లు, ₹1,150/- నగదు.
ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరిక.
జిల్లా పోలీసు శాఖ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇలాంటి గ్యాంబ్లింగ్, కోడిపందేలు, అక్రమ సమావేశాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలు కూడా చట్టవ్యతిరేక కార్యక్రమాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Add

