అందెశ్రీ పార్థివదేహానికి ఘన నివాళి.






అందెశ్రీ పార్థివదేహానికి ఘన నివాళి.

అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

క్రైమ్ 9 మీడియా తెలంగాణ ప్రతినిది రవి.నవంబర్ 11.

        ప్రముఖ కవి, రచయిత ఉద్యమ గొంతుక తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందే శ్రీ పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఎంతో కాలంగా అత్యంత సన్నిహితంగా ఆప్తమిత్రుడుగా మెలిగిన అందెశ్రీ ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళ్లు అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి అందే శ్రీ పార్థివదేహాన్ని పాడే మోశారు. వేలాదిగా అభిమానులు సాహితిప్రియులు, అక్షర యోధులు, కడసారి వీడ్కోలు పలికి వేలాదిమంది అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. ప్రభుత్వం అధికారిక లాంచనాలతో ముఖ్యమంత్రి ఆదేశాలతో అంత్యక్రియలు జరిపించారు ముఖ్యమంత్రి పరిశీలించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి, మంత్రులు పరామర్శించి వారికి ధైర్యాన్ని ఓదార్పు ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పి.ససి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రజా ప్రతినిధులు ఇతర ముఖ్యులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

 

Post a Comment

Previous Post Next Post