మండల ప్రజా పరిషత్ కార్యాలయ అధికారి కి సమగ్ర వివరాలకై సమాచారహక్కు చట్టంద్వారా దరఖాస్తు.
సమాచార హక్కు చట్టం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్.
క్రైమ్ 9 మీడియా.టేకుమట్ల మండల ప్రతినిది..నవంబర్.11.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి అనితకు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్, టేకుమట్ల మండల సభ్యులు మధుసూదన్ సమాచార హక్కు చట్టం ద్వారా మండల పరిషత్ కార్యాల సమగ్ర వివరాల కోసం దరఖాస్తు సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్.టి.ఐ ప్రతినిధులు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో జరిగిన మూడో విడత సామాజిక తనిఖీ లో ఏ టి ఆర్./ డి టి ఎఫ్ యాక్షన్ టాక్స్ రిపోర్టు మరియు సామాజిక తనిఖీలు అధికారులు పనిచేసిన వివరాలు మండలంలో టీ.కెపీ మరియు ప్రకృతి వనాల మరియ మెటీరియల్ పేమెంట్ వివరాలు మండల అభివృద్ధి అధికారి విధులు నిర్వహించినప్పటి వివరాలు మండలంలో గత ఆరు నెలలుగా ఎం.పీ.డీ.వో హాజరు మరియు గ్రామాల ఎం.జి.ఎన్.ఆర్.జి .వర్క్స్ విజిట్ చేసిన వివరాలు దరఖాస్తులో వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల కమిటీ సభ్యుడు మధుసూదన్ సమాచార హక్కు చట్టం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
