క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరుజిల్లా.చింతలపూడి, నవంబర్ 11:- చింతలపూడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కమిటీ నియామకం ఘనంగా జరిగింది. చింతలపూడి AMC చైర్ పర్సన్ గా చీదరాల దుర్గా పార్వతి మధుబాబు మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు, ఏలూరు ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి , తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ , ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, చింతలపూడి జనసేన ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి , గోపాలపురం జనసేన ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు, ఉండి ఇంచార్జీ జుత్తుగ నాగరాజు, జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు. ఈ సందర్బంగా మార్కెట్ యార్డ్ నూతన కార్యవర్గ సభ్యులకు ముఖ్య అతిథులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
