జిల్లా వ్యాప్తంగా 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు – ఎస్పీ.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నవంబర్ 1 నుండి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి వస్తుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమని, నిషేధిత ఆయుధాలు కలిగి ఉండరాదని, శాంతిభద్రతల కోసం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
