ఏలూరులో అవినీతికి వ్యతిరేకంగా ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ.

ఏలూరులో అవినీతికి వ్యతిరేకంగా  ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఈనెల 27 నుండి ఏసీబీ విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి . ఇందులో భాగంగా ఏలూరు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో శనివారం అవినీతికి వ్యతిరేకంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు .ఈ ర్యాలీ శనివారం ఏసీబీ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఇందులో భాగంగా అవినీతికి వ్యతిరేకంగా అవినీతికి నిరోధక శాఖ కార్యాలయ సిబ్బంది నినాదాలు చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు లేదంటే 10 64 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నగరంలో విజిలెన్స్ అవేర్నెస్ పోస్టర్లను అంటించామని ఆయన తెలిపారు. అవినీతిపైఅవగాహన కల్పించడం ద్వారా అనేకమంది అవినీతి అధికారుల కు చెక్ పెట్టవచ్చునని ఆయన తెలిపారు.

 ఏసీబీసీఐలు ఎం బాలకృష్ణ కే శ్రీనివాస్ లు పాల్గొన్నారు. అవినీతి నీ ప్రభుత్వం ప్రజల విద్యార్థుల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించమని ఆయన తెలిపారు. మరింత సమాచారానికి వివరాలకుఏసిబి డిఎస్పి 9440446157, సిఐలు:9440446158 9440446159. నెంబర్లకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డి.ఎస్.పి సూచించారు.
 

Post a Comment

Previous Post Next Post