వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె.
తెలంగాణ: మద్యం టెండర్లలో పాల్గొన మహిళా టీచరు ఏకంగా ఉద్యోగమే పోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ లో చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల పాఠశాల పీఈటీ పుష్ప.. మద్యం టెండర్లో పాల్గొని, ధర్మపూర్ వైన్ షాప్ దక్కించుకుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి టెండర్లకు అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు.. పీఈటీ పుష్పను సస్పెండ్ చేశారు.
