బీ.సీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు కలిసి రావాలి- బీ.సీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెట్ల శ్రీనివాస్.


 బీ.సీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు కలిసి రావాలి- బీ.సీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెట్ల శ్రీనివాస్.

 క్రైమ్ 9మీడియా. మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి. 

నవంబర్ 13:బీసీ సమాజ్ మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో మంచిర్యాల లోని బాలుర హైస్కూల్ మైదానంలో చర్చ కార్యక్రమం నిర్వహించారు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెట్ల శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం కార్యక్రమంలో బి.సిలకు రిజర్వేషన్ అమలు కావాలంటే అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో బీ.సీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని తీవ్ర వ్యతిరేకతను రాజ్యాంగబద్ధంగా కల్పించకపోతే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేశారు బిసి భావజాలాన్ని నియోజకవర్గం ప్రతి మండలానికి విస్తరింపజేసే బీసీల రాజాధికారం సిద్ధిస్తుందని అన్నారు అత్యధికంగా చట్టసభల్లో బీసీలు ఉన్నప్పటికీ అధికారం బీసీలకు అధికారం అందలేదని అన్నారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నినాదం రాజ్యాంగ హక్కుగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు ప్రసంగించారు .ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ కర్రీ లచ్చన్న బీసీ జిల్లా నాయకులు కర్ణ శ్రీధర్, రంగు రాజేష్ రిటైర్డ్ ఎంఈఓ దుర్గం రాజేష్ గౌడ్ బీసీ జిల్లా నాయకులు వైద్య భాస్కర్ మల్లేష్ రమేష్ రవీందర్ విజయ్ కుమార్, సమ్మయ్య, సతీష్ ,రాబోలు సతీష్, బీసీ నాయకులు పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post