ప్రకాశం జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు.


 ప్రకాశం జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ సభ్యులు శ్రీమతి గంజిమాల దేవి గ ప్రకాశం జిల్లా, మార్కాపురం మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు.  

తొలుత కమీషన్ సభ్యులు మార్కాపురం మండలం, రాయవరం గ్రామంలోని డా. బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ను సందర్శించి విద్యార్ధులకు అందిస్తున్న భోజనం నాణ్యతను, రుచి చూచి సంతృప్తిని వ్యక్తం చేశారు.

  రోజు మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేక నేను వస్తున్నానని ఇలా చేశారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూం పరిశుభ్రత బాగుందని ఆమె ప్రశంసించారు. 

అనంతరం మార్కాపురం మండలం, గోగులాదిన్నె గ్రామంలో రేషన్ షాపు ను తనిఖీ చేశారు. లబ్దిదారుల వివరాలు, రేషన్ పంపిణీ విధానాన్ని, స్టాక్ ను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం సందర్శించి. పిల్లలకు, బాలింతలకు అందిస్తున్న పోష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

అక్కడ మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.  

అనంతరం మార్కాపురంలో మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సందర్శించి వంటశాలను పరిశీలించారు. మెనూ కచ్చితంగా పాటించాలని, అలాగే వంటశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 

మార్కాపురంలో ని ఆంధ్రప్రదేశ్ గిరిజనసంక్షేమ గురుకుల పాఠశాల సందర్శించి మెనూ పాటించకపోవడం గమనించిన కమిషన్ సభ్యురాలు విద్యార్దులనీ అడిగి తెలుసుకున్నారు. విద్యార్దులు ఇక్కడ ఏం సరిగా పెట్టడం లేదు అని చెప్పారు. వారానికి 6 సార్లు గుడ్లు ఇవ్వాల్సిన చోట 2 సార్లు మాత్రమే ఇస్తున్నారని, సాయంత్రం పండ్లు ఇవ్వటం లేదని, 301 మంది విద్యార్దులు ఉన్న కూడా 2 లీటర్లు పాలు మాత్రం ఇస్తున్నారని, త్రాగు నీరు సరిగా ఇవ్వటం లేదని, 15. పిల్లలతోనే చపాతీలు చేయిస్తున్నారని అన్నం సరిపడ పెట్టడం లేదని మళ్ళీ వెళితే తిడుతున్నారని విద్యార్థినిలు సమస్యలు చెప్పారు. 

విద్యార్దులు చెప్పిన సమస్యలు విన్న ఆమె తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వం విద్యార్ధులకి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించటానికి అధిక మొత్తం లో నగదు వేచ్చిస్తుందని ఇలాంటి వారి వల్ల విద్యార్దులు నష్టపోకూడదు అని, ప్రిన్సిపాల్ ను పూర్తిగా విధుల నుండి తొలగించేలా సంబంధిత శాఖ అధికారులకు రిపోర్ట్ పంపించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారికి సూచించారు. అదే విధంగా వంట సిబ్బందిని కూడ తొలగించాలన్నారు. ఈ విషయం లో నిర్లక్ష్యం వహిస్తే సహించనని, కమిషన్ తరుపున కూడా సుమోటోగా తీసుకుంటాం అని ఆమె చెప్పారు. విద్యార్ధులకి అందించే సౌకర్యాలపై నిర్లక్యం వహిస్తే ఎంతటి వారి మీద అయిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

కమీషన్ సభ్యులు వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీమతి పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ శ్రీమతి వరలక్ష్మి, ఐసిడిఎస్ పిడి శ్రీమతి సువర్ణ, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీ లక్ష్మ నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post